Mahaa Daily Exclusive

  కుటుంబ సభ్యులందరినీ సమానంగా చూడాలి..!

Share

ఆదిలాబాద్, మహా
కుటుంబాలు సంతోషంగా, సాఫీగా సాగాలంటే తల్లితండ్రులు, భార్యను సమానంగా చూడాలని యాపల్ గూడ పోలీసు రిజర్వ్ బెటాలియన్ ఆర్ఎస్ఐ గోపి అన్నారు. బెటాలియన్ శిక్షణలో భాగంగా గురువారం కే.ఆర్.కే కాలనీలోని వృద్ధాశ్రమంలో సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. వృద్ధులకు నిత్యావసర సరకులు, పండ్లను పంపిణి చేసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఐ గోపి మాట్లాడుతూ వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల్లో చిన్నతనం వస్తుందని, వారి వ్యవహారానికి తగినట్లుగా నడుచుకుంటే సమస్యలు ఉండవని పేర్కొన్నారు. తమ ఉద్యోగంలో మూడేళ్ళకు ఒకసారి బదిలీలు ఉంటాయని, అందువల్ల కుటుంబానికి సరైన సమయం కేటాయించలేక పోతున్నట్లు తెలిపారు. వృద్ధాశ్రమానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్వాహకుల పనితీరు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఐలు నరేష్, రమేష్, నవీన్, రమేష్, లింగి వృద్ధాశ్రమం నిర్వహకులు రాకేందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Latest