TG: ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలోని బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్క నాటారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. కాగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Post Views: 35







