Mahaa Daily Exclusive

  విద్యార్థి, కుల సంఘాల నాయకులు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు ప్రవేట్ విద్యారంగ సంస్థ రక్షణకు ప్రత్యేక చట్టం అమలు చేయాలి మంచిర్యాల జిల్లా ట్రస్మ అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య..!

Share

మంచిర్యాల, మహా : జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, కుల సంఘాల నాయకులు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా ట్రస్మ అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య, ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి ఊదరి చంద్రమోహన్ గౌడ్ లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మంచిర్యాల జిల్లాలో కొంతమంది వివిధ పార్టీల విద్యార్థి సంఘాల నాయకులు, మరి కొంతమంది కుల సంఘాల నాయకులు ప్రైవేట్ పాఠశాలపై ఆరోపణలు చేస్తూ జిల్లా విద్య శాఖ అధికారులకు ఫిర్యాదులు అందజేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వారు వాపోయారు.
కొన్ని విద్యార్థి సంఘాలు, మరికొన్ని కుల సంఘాలు ప్రైవేట్ పాఠశాలల్లో నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతున్నారని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి పాఠశాల ఆవరణలోకి చొరబడి ప్రశాంతమైన పాఠశాలలో ఘర్షణ వాతావరణం నెలకొల్పుతున్నారని చెప్పారు.
తాము రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారమే విద్యాసంస్థలను నడుపుతున్నామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చాలామంది విద్యార్థి సంఘం నాయకులమని చెప్పుకుంటున్న వారికి పదవ తరగతలోపు పిల్లలు ఉన్నవారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా తాము విద్యార్థి సంఘం నాయకులమని యాజమాన్యాలను బెదిరిస్తూ బ్లాక్మెయిలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇలా బెదిరింపులకు గురి చేస్తున్న వారికి డబ్బులు ఇవ్వకపోతే తమ పాఠశాలలు, విద్యాసంస్థలపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ విద్యాసంస్థ భవనాలను సైతం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేట్ ఆస్పత్రుల ఆస్తుల రక్షణ కొరకు అమలు చేస్తున్న చట్టాలను మా ప్రైవేట్ విద్యాసంస్థలకు వర్తింపచేయాలని కలెక్టర్ ను వేడుకున్నట్టు చెప్పారు.

ట్రస్మ సొసైటీ గుర్తింపు మాకే ఉంది

మంచిర్యాల జిల్లాలో ట్రస్మ సొసైటీ గుర్తింపు మాకే ఉందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య, ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి లు స్పష్టం చేశారు. కొంతమంది తనకే ట్రస్మ గుర్తింపు రిజిస్ట్రేషన్ ఉందని తప్పుడు ప్రచారం చేసుకుంటూ మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు వాపోయారు. ఇలాంటి వారిపై చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు రాష్ట్ర, జిల్లా సొసైటీ ధ్రువ పత్రాలను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇకనుండి నకిలీ ట్రస్మ, విద్యార్థి సంఘాల నాయకులను మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారులు కట్టడి చేయాలని కోరారు.

Latest