Mahaa Daily Exclusive

  ఆర్.ఎం.పి పి.ఎం.పి కేంద్రాల్లో వైద్యం చేస్తే కఠిన చర్యలు జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిని శ్రీదేవి..!

Share

భూపాలపల్లి, మహా : జిల్లాలో ఆర్ఎంపీ పీఎంపీ కేంద్రాలలో ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి అర్హత గల ఆసుపత్రులకు రోగులను పంపించాలని జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిని శ్రీదేవి తెలిపారు.భూపాల్ పల్లి జిల్లా కేంద్రం లో మంగళవారం మూడు ఆర్ఎంపి పిఎంపి చికిత్స కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విధిగా ప్రధమ చికిత్స కేంద్రము అని బోర్డు పెట్టాలని ఆదేశించారు.రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వరాదని,ఇంజక్షన్లు చేయడం,వైద్య మందుల చిట్టిని వాడడం, సెలైన్ బాటిల్స్ ఎక్కించడము చేయకూడదని అన్నారు., రక్త పరీక్షలు,మూత్ర పరీక్షలు, అధిక మోతాదు మందులు ఇవ్వడం, అబార్షన్లు చేయడం, కాన్పులు నిర్వహించడం వైద్య చికిత్సలు చేయడం ప్రభుత్వనిబంధనలకు విరుద్ధమని హెచ్చరించినారు,కేవలము ప్రధమ చికిత్స మాత్రమే అందించి అర్హతగల ఆసుపత్రులకు పంపించాలని సూచించారు. గతంలో కూడా వీరికి నోటీసులు ఇచ్చినట్లు,నిబంధనలను అతిక్రమించి చికిత్స చేసిన వారిపై ప్రభుత్వ ఆదేశానుసారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మెడికల్ షాపులను సందర్శించి ఆర్.ఎం.పి ల యొక్క ప్రిస్క్రిప్షన్ నందు మందులు అమ్మ రాదని హెచ్చరించారు. మందులు విక్రయిస్తే మెడికల్ షాపులు సీజ్ చేయాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమములో
పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి, డెమో శ్రీదేవి, భూపాలపల్లి హెచ్ వి, ఏఎన్ఎం పాల్గొన్నారు.

Latest