హైదరాబాద్, మహా: హీరో విజయ్ దేవరకొండ కేసు విచారణకు కమిషనర్ రాకుండా ఏసీపీ రావడం పట్ల జాతీయ ఎస్టీ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా వేడుకలో గిరిజనుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు ఇదే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడంతో, విచారణ చేపట్టిన కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ విచారణకు హాజరు కావాలని కమిషనర్ కు నోటీసులు ఇస్తే మీరెందుకు వచ్చారు, ఆ మాత్రం తెలియదా అంటూ మాదాపూర్ ఏసీపీ పట్ల అసహనం వ్యక్తం చేసారు. మరో 15 రోజుల్లో హైదరాబాద్ కమిషనర్ విచారణకు హాజరు అవ్వకపోతే, డీజీపీని విచారణకు రప్పించాల్సి ఉంటుందని ఏసీపీని జాతీయ ఎస్టీ కమిషన్ హెచ్చరించింది.
Post Views: 24








