Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ జెండా మోసిన వారికి పదవులు పార్టీ సిద్దాంతం కోసం పనిచేస్తే అవకాశాలు వస్తాయి రానున్న రోజుల్లో బీసీ లకు మంచి రోజులు -రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్..!

Share

ఆదిలాబాద్, మహా

కాంగ్రెస్ జెండా మోసిన వారికి తప్పకుండ పదవులు వస్తాయని.. ఇందుకు తానే ఉదాహరణ అని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కు సంబంధించి పార్టీ పదవులు గతంలో ఢిల్లీ నుంచి వచ్చేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రత్న గార్డెన్ లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ కుమార్ యాదవ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ శ్రేణులు అభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తే తప్పకుండ అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు అందరికి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోపక్క ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్గం 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులు అమలుకు కేబినెట్ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తోందని కష్టపడి పనిచేస్తే పదవుల్లో అందరికి అవకాశం ఉంటుందని వివరించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో నియోజకవర్గాల పునరవిభజనతో 153 వరకు పెరగనున్నాయని తెలిపారు. మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి ఆశీర్వాదం తో తాను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందినట్లు గుర్తుచేశారు. అందరి ఆమోదం తోనే జిల్లా కమిటీ లో పదవులు ఉంటాయని చెప్పారు.

ఎవరికీ పదవులు వచ్చినా సహకారం
అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి

గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు పోరాడమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు.ఆ సమయం లో ఒక్కరు కూడా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం లేకున్నా ఏకంగా 50వేల ఓట్లు తెచ్చుకున్నానని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఓట్లు రాలేదని తెలిపారు. మరోపక్క లోక్ సభ ఎన్నికల్లోనూ 77వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. మరి కొన్ని ఓట్లు వచ్చి ఉంటే ఎంపీ గా గెలిచే వాళ్ళమని పేర్కొన్నారు. పార్టీలో ఎక్కువ మంది ఉన్నా కొంత మందికే పదవులు వస్తాయని ఎవరికి వచ్చిన అందరూ సహకరించాలని కోరారు. ఓపిక తో ఉంటే పదవులు తప్పకుండ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మెన్ తహెర్ బిన్ హందన్ అన్నారు. నాయకులు, కార్యకర్త లు ఐక్యంగా ఉండి పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ను అమలు చేయడం హర్షనీయమన్నారు.

ఈ సమావేశం లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీబీ ఛైర్మెన్ అడ్డి భోజరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, నరేష్ జాదవ్, నియోజకవర్గం ఇంచార్జిలు ఆడే గజేందర్, శ్యామ్ నాయక్, ఇంద్రకరణ్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గణేష్ రెడ్డి, పసుల చంటి, చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest