Mahaa Daily Exclusive

  వరంగల్ కలెక్టరేట్ లో ప్రపంచ జనాభా దినోత్సవం జనాభా నియంత్రణ పై అవగాహన కల్పించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ..!

Share

వరంగల్ మహా;

అధిక జనాభాతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు.

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వరంగల్ కలెక్టరేట్ లో శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ
పెరుగుతున్న జనాభా అనర్థాలకు కారణం అవుతుందన్నారు. ఈ మేరకు జనాభా నియంత్రణ అవశ్యకతను ప్రజలకు వివరించాలన్నారు.  జనాభా నియంత్రణ అదుపులో ఉండాలని, లేనిచో భావితరాలకు మౌలిక వసతులు, ఆరోగ్య రంగంపై ఒత్తిడి, విద్యా వనరులపై ప్రభావము ,ఉద్యోగ అవకాశాల కొరత ,లింగ అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు వస్తాయని ,వనరులు సరిపోక సమస్యలు ఉద్భవిస్తాయని అన్నారు. జనాభాను నియంత్రణలో ఉంచడానికి బాలికల విద్యను ప్రోత్సహించాలని, బాల్య వివాహాలను నిర్మూలించాలని ,గర్భ నిరోధక పద్ధతులపై అవగాహన కల్పించాలని, ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించాలని, సామాజిక అభిప్రాయాలను మార్చడానికి విస్తృత ప్రచారం చేయాలని ఆన్నారు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలలో జనాభా పెరుగుదల వల్ల వచ్చు సమస్యల పై అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కల్పనకు రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమానికి ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం ఈ సంవత్సరం థీమ్ “శరీరం మనసు సిద్ధంగా ఉన్నప్పుడే తల్లి కావడానికి సరి అయిన సమయం” పురస్కరించుకొని ఎంజీఎం వరంగల్ నర్సింగ్ స్కూల్ వద్ద నుండి ఎంజీఎం సర్కిల్ వరకు నర్సింగ్ విద్యార్థులు ,వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా ర్యాలీ నిర్వహించారు. అనంతరం
డాక్టర్ బి సాంబశివరావు వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవం జరుపు కోవడం 1989 జులై 11న మొదలైనదని తెలిపినారు. ప్రపంచంలో ఇండియాలోనే జనాభా మొదటి స్థానంలో చేరుకున్నది, దానిని నియంత్రించడానికి వైద్య ఆరోగ్యశాఖ ప్రజలలో తాత్కాలికమైన , శాశ్వతమైన కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పిస్తామని అన్నారు .
ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్వో విజయలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కొమురయ్య ,
ఆర్ఎంఓ డాక్టర్ శశి కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అర్చన, డాక్టర్ ఆచార్య , డాక్టర్ విజయకుమార్,
డాక్టర్ మోహన్ సింగ్, వైద్యాధికారులు ఆరోగ్యశాఖ సిబ్బంది, నర్సింగ్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.

Latest