వరంగల్ మహా;
బల్దియా ప్రధాన కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, ఉద్యోగులు పనిచేసే వాతవరణాన్ని కల్పించాలని అధికారులను వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి ఆదేశించారు.
శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పాత భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, 2వ, అంతస్తులలోని అన్ని విభాగాలను కమీషనర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డ్ ల గది, కంట్రోల్ రూమ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, మలేరియా. అకౌంట్, కంప్యూటర్, ఎస్టాబ్లిష్మెంట్ విభాగాలను పరిశీలించి ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది జాబ్ చార్ట్, ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
ఆయా అంతస్తులోని పలు విభాగాలలో మరమ్మతులు నిర్వహించుటకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదనవు కమిషనర్ ను ఆదేశించారు.
ఈ సందర్భంలో మలేరియా విభాగంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మలేరియా విభాగం ఉద్యోగి ని గమనించిన కమిషనర్ వెంటనే అతని ఈ నెల జీతం మంజూరు చేయకూడదని (నిలుపుదల) అదనపు కమిషనర్ కు ఆదేశించారు.
కమిషనర్ వెంట బల్దియా అదనపు కమీషనర్ జోనా, సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజిరెడ్డి, ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, పర్యవేక్షకులు ఆనంద్, రామకృష్ణ, దేవేందర్ , ఐటి మేనేజర్ రమేష్, తదితరులు, ఉన్నారు








