తిరుమలాయపాలెం,మహా:
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తిరుమలాయపాలెం మండల మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి బత్తుల రాధాకృష్ణ పత్రికా ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో శనివారం ఉదయం 9 గంటలకు మండల మహాసభ నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కునంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, రాష్ట్ర రైతు సంఘం నాయకులు మహమ్మద్ మౌలానా, జిల్లా కార్యవర్గ సభ్యులు దండి సురేష్, జిల్లా కార్యవర్గ సమితి సభ్యులు దంతాల బాలరాజు, చీమ రామకృష్ణ, ఇంటూరి వెంకటేశ్వర్లు, చావా వెంకట్రావు, జిల్లా మండల ముఖ్య నాయకులు పాల్గొంటారని మండల భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Post Views: 96








