టేకులపల్లి – మహా :
టేకులపల్లి మండల సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్యాధికారి కందుల దినేష్ ఆధ్వర్యంలో ర్యాలీ మరియు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ విపరీతమైన జనాభా పెరుగుదల వల్ల ఆరోగ్య రంగంపై విద్యా వనరులపై ఉద్యోగ అవకాశాలపై ఒత్తిడి పెరగడం, పేదరికం పెరగడం, స్త్రీ పురుష నిష్పత్తిలో అసమతుల్యత, నగరీకరణ పెరగడం వంటి ఎన్నో దుష్పరిమాణాలను మన భారతదేశం ఎదుర్కొంటుందని కాబట్టి మెరుగైన భారత సమాజ నిర్మాణం కొరకు జనాభా నియంత్రణకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కుటుంబ సంక్షేమ కార్యక్రమాల వల్ల తెలంగాణ సంతానోత్పత్తి రేటు 1.6 తో దేశ సగటు సంతాన ఉత్పత్తి రేటు 2.1 కంటే చాలా మెరుగ్గా ఉన్నామని అంటూ జనాభా నియంత్రణకు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులైన మహిళలకు ట్యూబెక్టమి,పురుషులకు వ్యాసెక్టమి లతోపాటు ప్రత్యామ్నాయ తాత్కాలిక పద్ధతులైన స్త్రీలకు నోటి మాత్రలు, కాపర్ టీ, అంతర ఇంజక్షన్ పురుషులకు కండోమ్ వంటివి వాడటంపై వైద్య సిబ్బంది ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని అలాగే తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించి పెళ్లయిన తర్వాత కనీసం రెండు సంవత్సరాల తర్వాత మొదటి బిడ్డకు జన్మనివ్వడం మరియు మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు మధ్య కనీసం మూడు సంవత్సరాల వ్యవధి ఉండడం వల్ల ఎన్నో ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కంచర్ల వెంకటేష్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ ఆరోగ్య విస్తరణ అధికారి దేవ నర్సింగ్ ఆఫీసర్ జగదాంబ సూపర్వైజర్ కౌసల్య సింగ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ధరణి శైలజ అమూల్య ఇంద్రజ రుక్సానా, ధర్మపురి రవికుమార్ కిరణ్ కుమారి రాజు గంటా శ్రీను అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు








