ఖమ్మం సిటీ , మహా. పర్యావరణ పరిరక్షణకు భాగంగా ఖమ్మం నగరంలోని కవిరాజునగర్ నారాయణ పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హార్టికల్చర్ ఆఫీసర్ బెల్లం రాధిక, 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపూడి రమాదేవి – సతీష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, “ప్రకృతిని పరిరక్షించు – జీవాన్ని సంరక్షించు” అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. సమాజంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా డీజీఎమ్ రమణ రెడ్డి, ఏజీఎమ్ ఎస్.రామ్‌కీ, ఆర్‌ఐ క్రాంతి, కోఆర్డినేటర్లు ప్రవీణ్, వినోద్, నీలిమ, ప్రిన్సిపాల్ అమలోద్భవి, ఏఓ నాగేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం, తల్లితండ్రులు పాల్గొని మొక్కల నాటే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.
Post Views: 22








