Mahaa Daily Exclusive

  నానో యూరియా ప్రయోజనాలపై అవగాహన. మండలంలో సహాయ వ్యవసాయ సంచాలకుడి పర్యటన…!

Share

చింతకాని, జూలై 11:
శుక్రవారం రోజు మధిర సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎస్. విజయ్ చంద్ర గారు చింతకాని మండలంలోని నాగులవంచ, మత్కేపల్లి గ్రామాల్లో పర్యటించారు. మత్కేపల్లిలో నానో యూరియా క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, నానో యూరియా వాడకం వలన మొక్కలకు తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు అందుతాయని తెలిపారు. ఇది పర్యావరణ పరిరక్షణకూ అనుకూలమని, కలుపు మందులతో కలిపి దీనిని పిచికారి చేయవచ్చని వివరించారు.

నాగులవంచ గ్రామంలో పచ్చిరొట్ట పంటలను పరిశీలించిన ఆయన, వాటి లాభాల గురించి వివరించారు. పంటల్లో ఎరువుల యాజమాన్యంపై కూడా రైతులకు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్. మానస, విస్తరణ అధికారి కార్తీక్ కళ్యాణి, పలువురు రైతులు పాల్గొన్నారు.

Latest