వైరా, మహా.
వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో 40 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ… “ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఓ ఇంటి కలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతతో కూడిన పాలనకు నిదర్శనం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, బొర్రా రాజశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వడ్డే నారాయణ, స్వర్ణ నరేంద్ర, మంగీలాల్, పట్టణ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, ఇతర నాయకులు గణేష్, మల్లు రామకృష్ణ, పెద్దప్రోలు లక్ష్మయ్య, పాలేటి నరసింహారావు, నర్వనేని అశోక్, బిడికె రత్నం, శ్రీరామనేని తిరుపతిరావు, గోసు రాధాకృష్ణ, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.








