Mahaa Daily Exclusive

  పారదర్శకంగా లబ్దిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపు…… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

Share

ఖమ్మం, మహా.
పారదర్శకంగా లబ్దిదారులకు కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయింపు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం యాతాలకుంట, రేజర్ల, పినపాక లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మంత్రి ఆదేశాల ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారులకు అలాట్ మెంట్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని అన్నారు. పైరవీలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు జరిగిందని అన్నారు.

67 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు కంప్యూటర్ ర్యాండమైజేషన్ పద్ధతిలో పారదర్శకంగా కేటాయించామని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పట్టాలను త్వరలో సత్తుపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, మంత్రి చేతుల మీదుగా అందిస్తామని అన్నారు.

సత్తుపల్లి నియోజకవర్గంలోని యాతాలకుంటలో 40, రేజర్లలో 20, పినపాకలో 7 మొత్తం 67 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గ్రామసభ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు కంప్యూటర్ ర్యాండమైజేషన్ పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయించామని అన్నారు. కంప్యూటర్ ర్యాండమైజేషన్ జాబితా గ్రామంలో ప్రదర్శిస్తామని, జిల్లా వెబ్ సైట్ లో కూడా పెట్టడం జరుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా యాతలకుంట లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న సొంత ఇంటిని జిల్లా కలెక్టర్ వచ్చిన నెల రోజులలోనే సాకారం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్డిఓ ఎల్. రాజేందర్ గౌడ్, మూడు గ్రామాల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Latest