Mahaa Daily Exclusive

  ప్రజలకు సేవ చేయడం తన కర్తవ్యం ఎనిమిది కోట్ల నిధులతో మున్సిపాలిటీ అభివృద్ధి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 8 కోట్ల 46 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపనలు చేశారు.
శనివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్న గూడ, కమ్మ గూడ, మన్నె గూడ, తుర్క యాంజాల్ వార్డులలో పలు అభివృద్ధి పనులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ఆరంభమైన నాటి నుండి గతంలో ఎన్నడూ లేనంతగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని అన్నారు. ప్రజలకు సేవ చేయడం తమ కర్తవ్యమని గుర్తు చేస్తూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest