రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహ
కొలీవింగ్ హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసిపి కేపివి రాజుకు, బీజేపీ, బీజేవైఎం నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో గల హాస్టల్స్ లో విష సంస్కృతిని ప్రోత్సహించేలాగా కోలీవింగ్ పద్ధతి పెట్టడం వలన ఆదిభట్ల, మంగళపల్లి, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు, యువత చెడిపోయే అవకాశం ఉందని, అలాంటి హాస్టల్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కన్వీనర్ వన్నావాడ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఏసిపి కేపివి రాజుకు ఫిర్యాదు పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల మహేందర్, బీజేపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు గోదల శేఖర్ రెడ్, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆడెపు రాఘవేంద్ర, బీజేవైఎం ఆదిభట్ల అధ్యక్షులు వినయ్, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బీరప్ప, బీజేవైఎం జిల్లా కార్యదర్శి విజయ్ రజక్, బీజేవైఎం జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ శశిధర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి సందీప్ తదితరులు పాల్గొన్నారు.








