Mahaa Daily Exclusive

  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : దామోదర రాజనర్సింహ

Share

మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సంగారెడ్డిలోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, భూభారతి, రైతు రుణమాఫీ, రైతు భీమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Latest