రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ కృషి చేయాలని, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొసుపల్లి ప్రతాప్ అన్నారు. సోమవారం ఆదిభట్ల మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు గజ్జల నర్సింహా రెడ్డి అధ్యక్షతన, బీజేపీ బూత్ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం కొంగరకలాన్ పరిధిలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బొసుపల్లి ప్రతాప్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని పేర్కొన్నారు. ప్రజలలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ జండా ఎగరడం ఖాయమని అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీలో బీజేపీకి బలమైన నాయకత్వం కార్యకర్తల బలం ఉందని త్వరలో జరిగే స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యల గుర్తించి ప్రజల పక్షాన పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, పొట్టి రాములు, అందాల లక్ష్మీపతి గౌడ్, ఉడుతల అశోక్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్, రవి చందర్ గుప్తా, శివ, వినయ్, హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.








