కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళల అభివృద్ధికి హార్దిక బలోపేతానికి పలు చర్యలు చేపట్టింది.
స్వశక్తి సంఘాలు మహిళలు తీసుకున్న రుణాలకు ఫిబ్రవరి, మార్చి నెలలకు వడ్డీ డబ్బులను ప్రభుత్వం మంజూరు చేసింది. మంథని నియోజకవర్గం పరిధిలోని కాటారం సబ్ డివిజన్ పరిధిలో 2031 స్వశక్తి సంఘాలకు ఫిబ్రవరి నెల రూ 33.46 లక్షలు, మార్చి నెలకు రూ 35.67 లక్షలు మొత్తం రూ 69.03 లక్షలు విడుదలయ్యాయి. ఈ నిధుల ను మంత్రి శ్రీధర్ బాబు కాటారంలో జరిగే సమావేశంలో సోమవారం మహిళలకు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ డి ఆర్ డి ఓ అధికారి బాలకృష్ణ స్వశక్తి సంఘాల మహిళలు సిబ్బంది పాల్గొంటారు.కాటారం మండలంలో 590 సంఘాలకు రూ 21.07 లక్షలు ఫిబ్రవరి నెలకు రూ10.19 లక్షలు, మార్చి నెలకు రూ 10.8 లక్షలు,మహదేవపూర్ మండలానికి 422 సంఘాలకు ఫిబ్రవరి లో రూలక్షలు మార్చి నెలలో 7.83 లక్షలు మొత్తం 15.56 లక్షలు, మలహర్ రావు 486 సంఘాలకు ఫిబ్రవరి నెలలో రూ 8.73 లక్షలు, మార్చి నెలకు రూ తో 9.60 లక్షలు మొత్తం18.33 లక్షలు, మహాముత్తారం 415 సంఘాలకు ఫిబ్రవరి నెలకు రూ 5.54 లక్షలు, మార్చి నెలకు రూ 6.04 లక్షలు మొత్తం 11.58 లక్షలు, పలిమెల మండలానికి 118 సంఘాలకు ఫిబ్రవరి నెలకు రూ 1.17 లక్షలు,మార్చ్ నెలకు రూ1.32 లక్షలు మొత్తం 2.49 లక్షలు మంజూరయ్యాయి.








