Mahaa Daily Exclusive

  మన అగ్రిటెక్ సేవలు భేష్ మన అగ్రిటెక్ ను సందర్శించిన జిల్లా అధికారి అనురాధ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ ఎనమాముల మార్కెట్ లో ఆధునిక వ్యవసాయ పరికరాలతో నెలకొల్పబడిన మన అగ్రిటెక్ సంస్థ ను వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సందర్శించారు.
ఈ సందర్భంగా మన అగ్రిటెక్ లో ఏర్పాటు చేసిన ఒక్కో స్టాల్స్ ను జిల్లా వ్యవసాయ అధికారుల తో కలిసి అనురాధ వారి బృందం వీక్షించారు.
ఈ సందర్భంగా సంస్థ అధినేత పాషికంటి రమేష్ స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వ్యవసాయ పరికరాలను వాటి పనితీరును క్లుప్తంగా వారికి వివరించారు.
నేటి ఆధునిక వ్యవసాయంలో రైతులకు మన అగ్రిటెక్ ద్వారా గత 8 సంవత్సరాలుగా రైతులకు అందిస్తున్న సేవలను ఛాయాచిత్రాల ద్వారా వారికి వివరించారు.
రైతుల కోసం మన అగ్రిటెక్ ద్వారా ఎన్నో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆధునిక వ్యవసాయం పట్ల రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తూ వారికి కావాల్సిన పరికరాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా దళారులు దరి చేరకుండా నేరుగా రైతులకు అందించాలానే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని రమేష్ తెలిపారు.
భవిష్యత్తు లో తాము అందిస్తున్న ఆధునిక వ్యవసాయ పరికరాలకు రైతులకు కావాల్సిన సబ్సిడీ రాయితీలు కల్పించి రైతులకు తొడ్పాటు అందించాలని మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్ కోరారు. ఇందుకు
జిల్లా అధికారి సానుకూలంగా స్పందించారు.
అగ్రిటెక్ ద్వారా అందిస్తున్న సేవల పట్ల అధికారులు అధినేత పాషికంటి రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Latest