Mahaa Daily Exclusive

  ఖమ్మంలో ఉద్రిక్తత..ఎస్సీ మోర్చా నేతపై దాడి..!

Share

ఖమ్మం, మహా.
ఖమ్మం నగరంలో అభ్యర్థుల విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతులకు దారితీసింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు గుండాలు ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ పై అమానుషంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలయ్యారు. సోమవారం జరిగిన ఈ దాడిలో గాయాల పాలైన కొండేటి శ్రీధర్ ఖమ్మం లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు రామచంద్ర రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు ఖమ్మం నగరంలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు.
అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు భట్టి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో అక్కడ ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది.

* ఆందోళన శాంతిభద్రతలకు సవాల్… కాంగ్రెస్ వర్గం దాడి.

నిరసన కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అనుచులు అక్కడికి చేరుకొని తీవ్ర ఆగ్రహంతో బీజేపీ వర్గాలపై దూశనలు ప్రారంభించారు. పరిస్థితి క్షణాల్లో వేడెక్కి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ హడావుడిలో కాంగ్రెస్ అనుచులు కొండేటి శ్రీధర్‌పై ఫిజికల్‌గా దాడికి పాల్పడ్డారు. ఆయనకు ముఖం, భుజాల భాగాల్లో గాయాలయ్యాయి. ఈ దాడిని అక్కడే ఉన్న పోలీసులు అదుపుచేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

* ఆసుపత్రిలో చికిత్స… భాజపా నేతల పరామర్శ.

గాయపడ్డ కొండేటి శ్రీధర్‌ను బీజేపీ కార్యకర్తలు వెంటనే సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సహా పలువురు నేతలు ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. శ్రీధర్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు సమాచారం.

* ప్రజాస్వామ్యంలో వ్యతిరేకతలకు హింస తగదు.

ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై తగిన స్థాయిలో రాజకీయంగా స్పందించాల్సిన కాంగ్రెస్ కార్యకర్తలు హింసను ఎంచుకోవడం దురదృష్టకరం అని అన్నారు. ఇకపోతే పోలీసుల తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్న నిరసన కార్యక్రమానికి తగిన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఈ దాడిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వం తక్షణ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి ఉద్రిక్తతలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Latest