Mahaa Daily Exclusive

  కల్వకుంట్ల కవిత పై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు సరైనవి కావు.బి ఆర్ ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్..!

Share

ఇల్లెందు ,మహా.
బీసీల రిజర్వేషన్ల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యులు మరియు జాగృతి వ్యవస్థాపక సభ్యురాలు కల్వకుంట్ల కవిత పై చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తు సోమవారం భారత రాష్ట్ర సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ కార్యాలయం నందు భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతామని ప్రకటించి గద్దెనెక్కిన తర్వాత, ఇచ్చిన హామీ కోసం నెరవేర్చడం కోసం భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యులు మరియు జాగృతి వ్యవస్థాపక సభ్యులు కల్వకుంట్ల కవిత రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో బీసీ సదస్సులు ధర్నాలు దీక్షలు చేపడుతూ ఢిల్లీలో కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైఒత్తిడితో తలోంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆమోదాన్ని హర్షిస్తూ జాగృతి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత గారు సంబరాలు జరుపుకుంటుంటే ఆ సంబరాలను హేళన చేస్తూ ఎమ్మెల్సీ కవిత గారిపై తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని ఇంతటి దిగజారుడు నీచమైన మాటలను బహిరంగ సభలలో ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.రాజ్యాంగబద్ధమైన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు బాధ్యతతో కూడిన సంభాషణలు చేయాలి కానీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అమానుషమని ఒక మహిళా ఎమ్మెల్సీకే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతిని దిగజారుస్తూ, మహిళల గౌరవాన్ని భంగపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అడిగేందుకు వెళ్లిన జాగృతి నాయకుల పైన భౌతికంగా దాడి చేయడమే కాకుండా కాల్పులు జరపటాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపడానికి వెళ్లిన జాగృతి కార్యకర్తల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన తీన్మార్ మల్లన్న సిబ్బందిపై 24 గంటలు గడచిన కూడా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సోషల్ మీడియాలలో ప్రభుత్వ వైఫల్యాల మీద పోస్టులు పెడుతున్న కార్యకర్తలను, నాయకులను, మహిళా జర్నలిస్టులను, అరెస్టు చేసి కేసులు పెడుతున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై, విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన అతని సిబ్బందిపై ఎందుకు. చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఏం ఎల్ సి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్న బే షరతుగా ఆమెకు క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునే ప్రసక్తి లేదని, హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టి బి జి కే ఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్ రంగనాథ్, ఇల్లందు మండలం మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీర్ భావ్ సింగ్ నాయక్, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ,బి ఆర్ ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ సోషల్ మీడియా యువజన విభాగం గిన్నారపు రాజేష్, సత్తాల హరికృష్ణ, కాసాని హరి ప్రసాద్,పట్టణ నాయకులు కడగంచి వీరస్వామి, నారపాక వసంతరావు, ఇల్లందు మండలం పట్టణ యువజన నాయకులు భూక్య సురేష్, లలిత్ కుమార్ పాసి, ములుగుండ ఉపేందర్ రావు, రామ్ లాల్ పాసి, సుందరగిరి శీను, కిషన్ పాసి,బజారు సత్యనారాయణ, పరకపల్లి రవి, ఎండి గౌస్,నారపకాయ యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Latest