ఇల్లెందు,మహా.
సింగరేణి ఇల్లందు ఏరియాలొ వివిధ రకాల కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు వారికి సకాలంలో వేతనాలు అందేలా కంపెనీ వారు ఉత్తర్వులు జారీచేసినారు దానికి విరుద్ధంగా సింగరేణి కాంట్రాక్టర్లు సకాలంలో వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి యండి నజీర్ అహ్మద్ మండిపడ్డారు. ఇల్లందు ఏరియాలో జేకె సివిల్, జేకె ఓసి,24 సివిల్ కొయగూడెం ఓసిపి నందు వివిధ పనులు కాంట్రాక్టు కార్మికులు నిర్వహిస్తున్నారని వారి వేతనాలు ప్రతినెల ఎడొవ తేదీలోగా చెల్లించాలి అని లెటర్ నేం.సిపిఆర్, పిఈఆర్, ఐఆర్,784 తెది 6-07-2023 న సింగరేణి ఉత్తర్వులు జారీచేసింది కాని దానికి భిన్నంగా కాంట్రాక్టర్లు చెల్లించకపోవడంతో పాటు కంపెనీ ఉత్తర్వులను ఉల్లంఘించి పదిహేను తేదీలొ ఇరవై తేదీలొ వేతనాలు కార్మికుల ఖాతాలో వేస్తున్నారనీ నేటి వరకు కార్మికులవేతనాలుచెల్లించలేదన్నారు.కార్మికుల కుటుంబాలు ఈ వేతనాలపై ఆధారపడి జీవిస్తున్నారు సకాలంలో వేతనాలు అందక కుటుంబా
లు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇకనైనా కంపెనీ ఉత్తర్వులను పాటిస్తూ కాంట్రా
క్టర్లు కార్మికుల వేతనాలు వేసెలా సింగరేణి అధికారులు చూడాలని నజీర్ అహ్మద్ యాజమాన్యంను డిమాండ్ చేశారు.








