ఇల్లందు, మహా.
సిపిఐ ఇల్లందు మండల కార్యదర్శిగా బొప్పిశెట్టి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం 21 ఏరియాలోని కొవ్వూరి రాయలింగు సభలో సిపిఐ 19వ మండల మహాసభను నిర్వహించారు. ఈ మహాసభలో సిపిఐ మండల కార్యదర్శిగా బొప్పిశెట్టి సత్యనారాయణ ను ఎన్నుకున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాష తెలిపారు. సహాయ కార్యదర్శులుగా బసిపాక రవి, ఆకుల చందర్రావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిత్యం పోరాటం చేస్తామని, సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందన్నారు.
Post Views: 100








