Mahaa Daily Exclusive

  ఆర్టీసీ బస్సు_ సిమెంట్ ట్యాంకర్ ఢీ ఆరుగురి కి గాయాలు తృటిలో తప్పిన ప్రమాదం ..!

Share

కామేపల్లి, మహా.
ఆర్టీసీ బస్సును సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులకు గాయాలైన సంఘటన మండల పరిధిలోని కామేపల్లి క్రాస్ రోడ్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నుండి ఆర్టీసీ ఆర్డినరీ బస్సు ప్రయాణికులతో ఇల్లందు వెళుతుండగా కామేపల్లి స్టేజి వద్ద ఆగి ఉండడంతో వెనక నుండి సిమెంట్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు ఐదుగురికి గాయాలైనాయి క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు 108 వాహనం ద్వారా తరలించారు. ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న మహిళ,మరో చిన్నారి కాలు సీట్ల మధ్యన ఇరుక్కోవడంతో అర్థగంట సేపు బయటికి రాలేకపోయారు.గుర్తించిన కామేపల్లి, కారేపల్లి క్రాస్ రోడ్ యువకులు వారిని బయటికి తీసి 108 వాహనం ద్వారా ఖమ్మం తరలించారు. కామేపల్లి ,కారేపల్లి పోలీసులు ట్రాఫిక్ ను నివారించారు.

Latest