Mahaa Daily Exclusive

  వ్య‌వ‌సాయ మార్కెట్ల పునరుద్ధరణ‌కు శ్రీకారం మార్కెటింగ్ కమిటీ చైర్మ‌న్ల భేటీకి కేంద్రంగా ఖ‌మ్మం. రైతుల ఆందోళ‌న‌లపై స‌మగ్ర‌ చ‌ర్చ‌…!

Share

ఖమ్మం, మహా.
రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కీలక వేదికగా మారింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యల పరిష్కారానికి పునాదిగా నిలిచేలా ఈ కార్యక్రమం సాగింది. వ్య‌వ‌సాయ మార్కెట్‌లు, వేప‌గింజ‌ల వంటి ప్ర‌త్యేక ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, బోర్డులు, కొత్త విధానాలు వంటి అనేక అంశాలపై ఈ భేటీలో చర్చ జరగడం విశేషం. వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి దిశగా పునర్నిర్మాణ చర్చలకు ఈ సమావేశం బలం చేకూర్చింది.
సంచాలకులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, హైదరాబాద్ ఆదేశానుసారం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయిలో నిర్వహించిన పునర్నిర్మాణ కార్యక్రమానికి ఖమ్మం వేదికైంది. సెంట్రల్ డీసీ ప్యారాగన్ పరిసరాల్లోని వివిధ యూనిట్లను పరిశీలించిన అధికారులు, మార్కెట్ కమిటీలు, రైతు సమితుల మధ్య సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తూ చర్చలు జరిపారు.

ఈ సమావేశానికి డీసీ సీఈఓ డి.యమ్.ఓ అశ్విన , డి.యమ్.ఓ. అత్లాస్ , మార్కెటింగ్ శాఖ అధికారులు, వైద్య, కల్లు, వేపగింజ తదితర వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న వైద్య సేవల పరిశ్రమలు, వేపగింజ పరిశ్రమల సమస్యలను కేంద్రంగా తీసుకొని సమగ్ర చర్చలు కొనసాగాయి.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు తమ అభిప్రాయాలను వివరించారు. ఖమ్మం జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ధరల క్షీణత, నిల్వలు, రవాణా లోపాలు వంటి సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. మార్కెట్ కమిటీ చైర్మన్లకు రాష్ట్ర స్థాయిలో ఒకే విధంగా విధులను అప్పగించాలన్న సిఫారసులు ప్రతిపాదించాయి.

* వ్యవసాయంలో వైద్య, వేప పరిశ్రమల ప్రాధాన్యత.

వేపగింజ, వైద్య పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అవసరమని ప్రతిపాదనలతో ఈ సమావేశం మైలురాయిగా నిలిచింది. సప్లై చైన్ బలోపేతం, మార్కెట్ లింకేజెస్, రైతులకు మెరుగైన ధరల కల్పనపై సెంట్రల్ డీసీతో సమావేశమైన అధికారులు పలు కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో వైద్య, వేప పరిశ్రమల వృద్ధికి వీలైన విధంగా జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని సూచనలు వచ్చాయి.

* సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి సూచనలు.

ఈ సమావేశంలో మాట్లాడిన వక్తలు వ్యవసాయంతో పాటు సూక్ష్మ పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్యాకేజింగ్, ప్రాసెసింగ్, నిల్వ వసతుల మెరుగుదల, కొత్త బోర్డుల ఏర్పాటు వంటి అంశాలను ప్రాధాన్యతతో తీసుకోవాలని స్పష్టంగా తెలిపారు. డీసీ అశ్విన్ గారు ఈ సూచనలను పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించాలని హామీ ఇచ్చారు.

* అవసరమైన విధాన మార్పులపై చర్చ.

పాలకుల అవగాహనలో మార్పు అవసరమని, వ్యవసాయ మార్కెట్ కమిటీలు కేవలం ధరల నిర్ణయాలకే కాకుండా, రైతుల మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు రావాల్సిన అవసరముందని సభలో పలువురు చైర్మన్లు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ కమిటీ చైర్మన్ల అనుభవాల సమీక్షకు ఖమ్మం వేదికగా మారింది.

Latest