Mahaa Daily Exclusive

  నగరంలో వేగంగా అభివృద్ధి పనులు. ..!

Share

ఖమ్మం సిటీ, మహా
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. డివిజన్ నెంబర్ 14 గోల్లగూడెం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న డబల్ యు ఎం ఎం రోడ్డును క్వాలిటీ కంట్రోల్ బృందం పరిశీలించింది. రోడ్డులో వేసిన లేయర్ మందాన్ని పలు చోట్ల తనిఖీ చేసి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు.

అదే విధంగా, సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న టేబుల్ టెన్నిస్ షెడ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. షెడ్ నిర్మాణంతో పాటు పైకప్పు పనులు కూడా పూర్తవుతున్నాయి.

డివిజన్ నెంబర్ 10లో సి సి రోడ్ నిర్మాణం పురోగతిలో ఉంది. స్థానికులు ఈ రోడ్డు నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా, గోల్లగూడెం నర్సరీ మరియు ఎడ్గా పార్క్‌ను ఉద్యాన శాఖ అధికారి సందర్శించారు. మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించి, తగిన సూచనలు ఇచ్చారు.

ఈ అభివృద్ధి చర్యలతో నగర రూపురేఖలు మారిపోతున్నాయని అధికారులు తెలిపారు.

Latest