భద్రాద్రి కొత్తగూడెం, జూలై 14 (మహా): ఎస్సీ విద్యార్థుల వసతిగృహ అపరిశుభ్రపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య ఎం రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ రామవరంలో ఉన్న ఎస్సి ప్రభుత్వ కళాశాల బాలుర వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా, వసతి గృహం లోని తరగతి గదులు, కిచెన్ రూం, స్టోర్ రూంలను హాస్టల్ పరిసరాలను న్యాయమూర్తి పరిశీలించారు. హాస్టల్ పరిసరాలు, శౌచాలయాలు శుభ్రంగా లేకపోవడం వలన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. హాస్టల్ పరిసరాల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, శౌచాలయాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
Post Views: 72








