Mahaa Daily Exclusive

  కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐని వెంటనే జమ చేయాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమోల్ల కిరణ్…!

Share

ఆదిలాబాద్, మహా
రిమ్స్ లో పనిచేస్తున్న ఐ.హెచ్.ఎఫ్.ఎం.ఎస్ కాంట్రాక్టు కార్మికుల జూన్ నెల వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ ని వెంటనే జమ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ కోరారు. ఈ మేరకు మంగళవారం రిమ్స్ కార్మికులతో కలిసి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ రిమ్స్ కమిటీ ఆధ్వర్యంలో డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఐహెచ్ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టు కాలం ముగిసిందని అధికారులు పత్రిక ముఖంగా ప్రకటించగా…. సదరు కాంట్రాక్టర్ మాత్రం సస్పెన్షన్ పై హై కోర్ట్ నుండి స్టే తెచ్చుకున్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితి నెలకొందని వివరించారు. కార్మికుల్లో నెలకొన్న ఆందోళన తొలగించి వారి బాధ్యత ఎవరు తీసుకుంటారో స్పష్టం చేయాలని కోరారు. కార్మికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రిమ్స్ కార్యదర్శి పెర్క దేవిదాస్, నాయకులు సురేందర్, పొచ్చన్న, ఖలీల్, రమేష్, రమాకాంత్, రాము తదితరులు పాల్గొన్నారు.

Latest