బోనకల్, మహా.
బోనకల్ మండలం రావినూతల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శుభారంభమైంది. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.
షేక్ సిలార్ బీ ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లూరి రవి శంకుస్థాపన చేసి ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నేత చేబ్రోలు వెంకటేశ్వర్లు, మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ వట్టికొండ రామకృష్ణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోతు శ్రీను నాయక్, ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు వై.హేమూన్, బంధం సైదులు, ఆవునూరి సత్యనారాయణ, బుడగ జంగం మండల అధ్యక్షుడు పాటి నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకుడు ఇండ్ల నాని తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్థులు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సంక్షేమ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు.
Post Views: 26








