Mahaa Daily Exclusive

  నలుగురికి ఎల్ వోసీ పత్రాలు అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి..!

Share

ఖమ్మం సిటీ, మహా.
పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో నలుగురికి మోకాలి శస్త్ర చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.6 లక్షలు మంజూరయ్యాయి. కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామానికి చెందిన కొల్లి నాగమ్మ, జాలా ధనమ్మ, మొండేపూడి కృష్ణారావు, మండేపూడి సత్యమ్మ లు మోకాలి శస్త్ర చికిత్స అవసరమై..ఆర్థిక తోడ్పాటు కోసం ఇటీవల ఎంపీ ని కలిసి విన్నవించగా.. వెంటనే స్పందించి మంజూరు చేయించిన ఎల్ వోసీ పత్రాలను మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసం వద్ద బాధితులకు అందజేశారు. నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) లో మోకాలి ఆపరేషన్ కోసం ఒక్కొక్కరికీ రూ. 1.50 లక్షల చొప్పున కేటాయించారని, శస్త్ర చికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారంతా ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

Latest