మహా భద్రాచలం
తెలుగుదేశం పార్టీ భద్రాచలం నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి భద్రాచలం నియోజకవర్గం పరిశీలకులు వట్టం నారాయణ దొర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు పోటు రంగారావు, కొడాలి శ్రీనివాస్ , కుంచాల రాజారాం, కంభంపాటి సురేష్ , పిల్లంటి దేశప్ప, అభినేని శ్రీనివాస్ , సీనియర్ నాయకులు శ్రీనివాస్ , వాసిరెడ్డి చలపతిరావు, నూతలపాటి దాసయ్య, పాల్గొన్నారు.తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రావడం ఖాయం అని,భద్రాచలం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నేటికీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయని వక్తలు పేర్కొన్నారు.
ఈ సమావేశం అనంతరం భద్రాచలం తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ని పరిశీలకులు వట్టంనారాయణ దొర సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, అధ్యక్షులుగా తాళ్లూరి చిట్టిబాబు, ఉపాధ్యక్షులు రేపాక రాంబాబు తో పాటు మరికొంత మందిని నియమించారు.








