మహా భద్రాచలం
గత రెండు రోజులుగా భద్రాచలంలో నిర్వహిస్తున్న నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ గ్రూప్ సి మహాసభలు మంగళవారం తో ముగిసాయు.ఈ మహాసభలకు గ్రూప్ సి జనరల్ సెక్రెటరీ మరియు సెక్రటరీ జనరల్ అయినటువంటి వాసిరెడ్డి శివాజీ , మాజీ సెక్రెటరీ జనరల్ కిషన్ రావు, పోస్ట్మాన్ గ్రూప్ డి, గ్రామీణ డాక్ సేవకులు రాష్ట్ర నాయకులు హాజరై భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. ప్రస్తుత పరిస్థితులలో తపాలా శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి తీసుకోబోయే నిర్ణయాలను తెలియజేశారు. ఈ సమావేశాలకు గత రెండు రోజులుగా చైర్మన్గా జి నాగేశ్వరరావు, సెక్రటరీగా రమేష్ నాయక్ వ్యవహారించారు.
మమ్మీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రానున్న రెండు సంవత్సరాలకు నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ గ్రూప్ సి రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎం వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్గా పమ్మి వెంకటేశ్వర్ రావు, కార్యదర్శిగా రామ్ కుమార్, కోశాధికారిగా నరసింహారెడ్డి, సహాయ కార్యదర్శిగా ఆర్ సంతోష్ , 15 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.








