నేలకొండపల్లి, జులై 15 మహా :
ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల కు సంబంధించిన యంత్ర పరికరాలు సకాలంలో అందించరా లేదా అనే విషయాల పై ప్రభుత్వం నియమించిన రాష్ట్ర కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ బీ.ఎన్.రావు ఆరా తీశారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో యంత్రాలను, ఫ్యాడీక్లీనర్, తేమ శాతం యంత్రం, ఎలక్ట్రానిక్ కాంటాలు, లిప్టర్ మరియు క్లీనర్ యంత్రాలను పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన యంత్రాలు ప్రస్తుతం ఉన్నాయా లేదా అని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మార్కెట్ కార్యాలయం లో సోసైటీ సీఈవోలు, ఐకేపీ, మార్కెట్ అధికారులతో ప్రత్యేక సమావేశం -నిర్వహించారు. యంత్రాలు కొనుగోలు సమయంలో సంబంధిత అధికారులు అందించరా లేక జాప్యం చేశారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. యంఎస్పీ యంత్రాలు 350, టార్పాలిన్ లు 15 వేలు, ఎలక్ట్రానిక్ కాంటాలు 350, తేమ శాతం పరిశీలన యంత్రాలు 362 లను జిల్లా లోని ఆయా కొనుగోలు కేంద్రాలను సరఫరా చేసిన వాటి వివరాలు, అవి సక్రమంగా పని చేస్తున్నాయా లేదా మరమ్మతులతో ఇబ్బంది పెట్టాయా …ప్రస్తుతం వాటి కండీషన్ ఎలా ఉంది..ఇంకా కేంద్రాలకు ఏమైనా సౌకర్యాలు కావాలా అని ఇటు రైతుల నుంచి..అటు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనే విషయాలను తెలుసుకున్నారు. కేంద్రాల వారీగా యంత్రాల పంపిణీ పై సమాచారం ను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల ఇంకా విజయవంతంగా నిర్వహించేందుకు ఏమైనా చేయాలా అనే విషయం గురించి చర్చించారు. జిల్లాలోని రైతులు…ఐకేపీ, ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సీఈఓ లు, మార్కెటింగ్ శాఖ అధికారులు కేంద్రాల పని తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం కు నివేధిక ను అందించేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలన కు మార్కెట్ ను సందర్శించినట్లు రాష్ట్ర కో-ఆర్డినేటర్ బీ.ఎన్.రావు పేర్కోన్నారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి యం.ఏ.ఆలీమ్, నేలకొండపల్లి మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల సీతారాములు తదితరులు పాల్గొన్నారు.








