Mahaa Daily Exclusive

  నిరుపేద విద్యార్థినికి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ల్యాప్ టాప్ వితరణ..!

Share

కూసుమంచి, జులై 15, మహా:

ఎన్ ఆర్ఐ ఫౌండేషన్ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. నిరుపేద విద్యార్థినికి చదువుకోసం మంగళవారం ల్యాప్ టాప్ అందజేసింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన జడం నవీన కోదాడ కిట్స్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ సహాయంతో విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సభ్యురాలు, హఠ్యతండా ప్రధానోపాధ్యాయులు తీర్థాల శ్రీదేవి లెనిన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. లెనిన్, శ్రీదేవిలు సంయుక్తంగా నవీనకు ల్యాప్ ట్యాప్ కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ కు నవీన, కుర్రి సైదులు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో బయ్యన బాబురావు,లెనిన్, బండి నాగేశ్వరరావు,శ్రీదేవి పాల్గొన్నారు.

Latest