వరంగల్ మహా;
వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ పరిధిలోని మహిళలు, విధ్యార్థునులకు భద్రతపై భరోసా కల్పించడంలో భాగంగా నర్సంపేటలో ఏర్పాటు చేయడం జరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. నర్సంపేట డివిజన్ పరిధిలో మహిళల భద్రత కోసం నర్సంపేట పట్టణ కేంద్రంలో పోలీస్ సిబ్బంది నివాస సముదాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షీ టీం కార్యాలయాన్ని వరంగల్ లాంఛనంగా ప్రారంభించారు. నర్సంపేట షీ టీం విభాగం తొలి ఎస్.ఐగా నియమించబడిన స్వాతిని పోలీస్ కమిషనర్ మొక్కను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా నర్సంపేట నూతనంగా ఏర్పాటు చేసిన షీ టీం విభాగం నిర్వహించాల్సిన విధుల పై షీ టీం ఏసిపి సదయ్య పోలీస్ కమిషనర్ కు వివరించగా, మహిళా కాలేజీ, పాఠశాల విధ్యార్థునుల భద్రత కోసం షీ టీం తరుపున కాలేజీ విధ్యార్థునులు అకతాయిల నుండి తమకు తాము రక్షించుకొనేందుగాను షీ టీం ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫేన్స్‌లో భాగంగా విద్యార్థునులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ అందించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ వేగంగా అభివృద్ది చెందుతున్న నర్సంపేట పట్టణంలో పదుల సంఖ్యల ఉన్నత విద్యకు సంబంధించిన కళాశాలతో పాటు, చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో వివిధ అవసరాల కొసం నర్సంపేట నగరానికి వచ్చి పోయే మహిళలతో పాటు స్థానిక మహిళలు, విద్యార్థునులకు భద్రత కల్పించడం కోసమే నర్సంపేటలో షీ టీం విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం మూడు షీ టీంలు పనిచేస్తున్నాయని ఎవరైన ఆకతాయిలు మహిళలను వేధించిన లైంగిక వేధింపులు గురిచేసిన తక్షణమే నర్సంపేట టీం విభాగం ఫోన్ నంబర్ 8712552326 సమాచారం అందించాలని కోరారు. నర్సంపేటలో ఏర్పాటు చేసినట్లే రాబోవు రోజుల్లో జనగామ జిల్లా కేంద్రంలోను షీ టీంను ఎర్పాటు చేయడం జరుగుతుందని అదే విధంగా అవకాశాన్ని బట్టి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరిన్ని షీ టీం బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్‌జోన్ డిసిపి అంకిత్ కుమార్, నర్సంపేట,షీ టీం ఏసిపిలు రవీందర్ రెడ్డి, సదయ్య, వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం ఇన్స్‌స్పెక్టర్ సుజాత, నర్సంపేట ఇన్స్‌స్పెక్టర్ రఘు, దుగ్గొండి సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ సాయిరమణ, నర్సంపేట డివిజన్ ఎస్.ఐలు ఇతర పోలీస్‌సిబ్బంది, విద్యార్థులు పాల్గోన్నారు.
అనంతరం…..
నర్సంపేట, ఖానాపూర్, దుగ్గొండి పోలీస్ స్టేషన్ల ను సందర్శించిన సిపి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం నర్సంపేట డివిజన్ పరిధిలోని నర్సంపేట,దుగ్గొండి, ఖానాపూర్ పోలీస్ స్టేషన్లతో పాటు, నర్సంపేట ఏసిపి, దుగ్గొండి సర్కిల్ పోలీస్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్బంగా స్టేషన్ అధికారులు పోలీస్ కమిషనర్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్ పనీతీరూ, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను పోలీస్ కమిషనర్ సంబంధిత స్టేషన్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.








