Mahaa Daily Exclusive

  హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్..కత్తి స్వాధీనం..

Share

 

 

హసన్‌పర్తి,మహా ;

 

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వంగపహాడ్ గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన నిందితుడిని హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు వెల్లండించిన

కేసు వివరాలు….

వంగపహాడ్ గ్రామానికి చెందిన ముస్కు సంతోష్ (వయస్సు: 22 సం.లు, తండ్రి, సంరక్షకుడు సరిత, వృత్తి: టెంట్ హౌస్ వర్కర్) అనే యువకుడు ఆరో తరగతి వరకు చదువుకుని మానేశాడు. ప్రస్తుతం టెంట్ హౌస్ పాండాలు వేసే పనికి వెళ్తున్నాడు. ఈ నెల 21 10 2026 రాత్రి సుమారు 11 గంటల సమయంలో గ్రామంలో దుర్గామాత విగ్రహ ఊరేగింపు జరుగుతుండగా, సంతోష్ మద్యం సేవించి బస్టాండ్ సమీపంలోని హనుమాన్ విగ్రహం వద్ద ఊరేగింపు చూడటానికి వెళ్లాడు.

అక్కడ అతనికి అదే గ్రామానికి చెందిన ముస్కు వినోద్ (వయస్సు: 40 సం.లు, తండ్రి: బాల్ రెడ్డి, కులం: దొమ్మర) కనిపించాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా పాత పగలు ఉన్నాయి. ఈ క్రమంలో సంతోష్ అతని వద్దకు వెళ్ళి బూతులు తిడుతుండగా, అక్కడున్న స్థానికులు వారిని వారించి ఆపారు. ఎలాగైనా వినోద్‌ ను చంపాలనే ఉద్దేశంతో సంతోష్ తన ఇంట్లో ఉన్న కత్తిని తీసుకువచ్చి వినోద్‌ను చంపుతానని బెదిరించాడు. దీంతో ప్రాణభయంతో వినోద్ అక్కడి నుండి పారిపోయాడు. వినోదు ఫిర్యాదు మేరకు 23 10 2026 రోజున హసన్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది

 

*నేరానికి ఉపయోగించిన కత్తి స్వాధీనం*

 

ఘటన అనంతరం నిందితుడు సంతోష్ ఆ కత్తిని వంగపహాడ్ గ్రామ శివారులోని శ్రీ కృష్ణ రేకుల కంపెనీ సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో దాచిపెట్టాడు. బుధవారం నిందితుడు తిరిగి ఆ కత్తిని తీసుకోవడానికి రాగా, పక్కా సమాచారంతో పోలీసులు పంచుల (సాక్షుల) సమక్షంలో అతడిని పట్టుకున్నారు. నిందితుడు పంచుల ముందు నేరాన్ని ఒప్పుకుని ఇచ్చిన సమాచారం మేరకు పొదల్లో వెతకగా నేరానికి ఉపయోగించిన పొడవాటి, పదునైన ఇనుప కత్తి లభ్యమైంది.

 

కత్తి యొక్క వివరాలు:

స్వాధీనం చేసుకున్న కత్తి పిడి 4 ఇంచుల పొడవు గల చెక్కతో చేయబడి ఉన్నది. పిడి భాగం నుండి కత్తి 12 ఇంచుల పొడవు, ఒక ఇంచు వెడల్పు కలిగి ఉంది. అక్కడ నుండి పదునైన భాగం మొన వరకు 13 ఇంచుల పొడవుతో ‘జే ‘ ఆకారంలో ఉంది. పోలీసులు ఈ కత్తిని స్వాధీనం చేసుకుని, సాక్షుల సంతకాలు గల చిట్టీలను దానికి అంటించి సీజ్ చేశారు.

హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ నిందితుడిని అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించడం జరిగింది.