Mahaa Daily Exclusive

  భారీ వర్షానికి తెగిన ఎర్రకుంట కట్ట పరిశీలించిన ఇరిగేషన్ డిఈ పరమేశ్వర చారి..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహించాయి. మొయినాబాద్ మండలంలో నీటితో నిండిన బాకారం ఎర్రకుంట చెరువు ఒక్కసారిగా కట్ట తెగిపోయి కుంటలోని నీరంతా ఉరకలు వేస్తూ ప్రవహించాయి. దీంతో బాకారం, ఎన్కెపల్లి రహదారి దాదాపు రెండు గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. చెరువులోని నీరంతా దిగువ భాగాన వృధాగా ప్రవహించింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఈ పరమేశ్వరచారి బాకారంలోని ఎర్రకుంటను సందర్శించి పరిశీలించారు. భారీ వర్షం కురవడంతో చెరువు పూర్తిస్థాయి నీటితో నిండడం మూలానే కట్ట తెగిపోయిందని సూచించారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో వరద నీరు అధికంగా చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తెగిపోయిన చెరువు కట్టకు మరమ్మత్తులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest