వరంగల్ మహా;
వరంగల్ నగరంలో ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేస్తున్నారని రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట ప్రాంతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 285 లో ఎకరం 14 గుంటలు 294 సర్వే నెంబర్లు నాలుగు ఎకరాల ఒక గుంట స్థలము తన సోదరి బండి సరోజన పేరు మీద ఉందని, నాలుగు రోజుల క్రితం కొందరు కబ్జా రాయుళ్ళు గండ్రాతి రామనారాయణ, కాసాని కుమారస్వామి, నాగపురి కుమారస్వామి, పిన్న మల్లేశం, పులిశేరు అరుణ్, ఖాళీగా ఉందని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినారని గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఇటు పోలీసులకు అటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించు కోవడంలేదని 40 సంవత్సరాల క్రితం భూమిని పట్టాదారుల నుండి కొనుగోలు చేశామని ఇప్పటివరకు భూమి తమ ఆధీనంలోనే ఉందని అయినా కొంతమంది బ్రోకర్లు ఏకమై తన సోదరికి సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్నారని వెంటనే అక్రమ నిర్మాణాలు తొలగించి తమకు న్యాయం చేయాలని కొండ దేవయ్య అధికారు లను కోరుతున్నారు.








