Mahaa Daily Exclusive

  తనపై ఆరోపణలు సరికాదు.. గోపాల్ గౌడ్ ..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
ఇబ్రహీంపట్నం మండలం, ఆదిభట్ల గ్రామంలో సర్వే నెంబర్ 44లో గల భూమి పై కొందరు గ్రామస్తులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వ భూమి అంటూ ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ యొక్క భూమికి సంబంధించి భాజప్త తన వద్ద ఆధారాలు ఉన్నాయని, పల్లె గోపాల్ గౌడ్ అన్నారు. ఎవరైతే ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఉన్నారో, ఎమ్మార్వో కార్యాలయంలో రికార్డులను చూసి మాట్లాడాలని అన్నారు. 44 సర్వేనెంబర్ లోని భూమి 38E ప్రకారం తను పట్టా పొందినట్లు తెలిపారు. కొందరు రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పాడు.

Latest