వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎల్బీనగర్ లోని ఏ-1 ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 రోజుల కార్యక్రమాల్లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలిసి మంత్రి కొండా సురేఖ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, బిఆర్ ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు కేవలం దరఖాస్తుల వరకే పరిమితం అయ్యాయని గత పది సంవత్సరాలుగా అర్హులైన లబ్ధిదారులకు పేద ప్రజలకు రేషన్ కార్డులు లేక అనేక ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్ ప్రజా పాలనలో మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని ఇది మాటల ప్రభుత్వం కాదని చేతలతో చెప్పిన హామీలన్నీ నెరవేర్చే ప్రజా ప్రభుత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బల్దియా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.








