Mahaa Daily Exclusive

  జీవకోటికి ప్రాణవాయువు అందించేది పచ్చని చెట్లే మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..!

Share

వరంగల్ మహా;

సమస్త జీవకోటికి ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచే బాధ్యత మనమందరం తీసుకుందామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.
శుక్రవారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలల ప్రాంగణంలో
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వనమహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సంధ్యారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డి ఎఫ్ ఓ అనుజ్ అగర్వాల్, ఏఎస్పీ శుభం, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ పోశాల పద్మ లతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ
మాజి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1951 సం.లో వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారని, అప్పటినుండి ప్రతి సంవత్సరం జూలై మాసంలో వనమహోత్సవం నిర్వహిస్తూ గత సంవత్సరం 75 వసంతాలు పూర్తి చేసుకున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటడమే ఈ వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల పౌరులకు తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని చేసిన విజ్ఞప్తి ని ప్రతిధ్వనిస్తూ మంత్రి అన్నారు. ముఖ్యంగా తల్లులు తమ పిల్లల పేర్ల మీద కూడా చెట్లు నాటాలని మంత్రి కోరారు. మనం మన సొంత పిల్లల మాదిరిగానే చెట్లను పెంచితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆకుపచ్చ తెలంగాణ అవుతుందన్నారు. గత సంవత్సరం 95% మొక్కలు నాటడం జరిగిందని, ఈ సంవత్సరం వన మహోత్సవంలో సంబంధిత శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా 100% మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలను నాటి గిరిజనులకు ఉపాధి కల్పించే దిశగా ప్రణాలికలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
చెట్లను నరకడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుందని, సమయానికి వర్షాలు కురవని, అనధారికంగా చెట్లను నరకడం క్షమించదగని నేరమని మంత్రి పేర్కొన్నారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల భయంకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు సోకే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు విద్యార్థి దశ నుండే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించాలన్నారు.
పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నివారించుటకు జిల్లా యంత్రాంగం, బల్దియా ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించుటకు పలు
కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి జరిగే ముప్పు గురించి ప్రజలను చైతన్యం కల్పిస్తూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నివారించేందుకు మనమందరం కలసికట్టుగా మహానగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుటకు కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.

నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ బల్దియా తరఫున పెద్ద ఎత్తున అవెన్యూ , సెంట్రల్ మీడియన్, పార్కులలో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ స్థలాలు, చెరువులు కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా పరిరక్షించే విధంగా మొక్కలు నాటడంతో పాటు పరిరక్షించడం జరుగుతుందన్నారు. ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతుందని, బల్దియా ఆధ్వర్యంలో నాటుతున్న మొక్కలను పరిరక్షించే బాధ్యత మనందరిపై ఉందని మేయర్ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి, మేయర్, కలెక్టర్ అధికారులు ప్రజలు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కల నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, శాఖ అధికారి అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏసీపీ శుభం, కార్పొరేటర్ పోశాల పద్మ, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, హార్టికల్చర్ అధికారులు రమేష్, లక్ష్మారెడ్డి, ప్రధానోపాధ్యాయులు శారదాబాయి, సంబంధిత శాఖల అధికారులు, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు పరశురాములు, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.

Latest