TG: అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం పర్యటనలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బోగస్ మాటలు చెప్పి రైతులను, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారు. రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి వయోవృద్ధులను మోసం చేశారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తున్నదని ప్రజలు బాధపడుతున్నారు’ అని విమర్శించారు.
Post Views: 62








