Mahaa Daily Exclusive

  బంగ్లాదేశ్‌లో విమాన ప్రమాదం.. సాయం చేసేందుకు సిద్ధం: ప్రధాని మోదీ

Share

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్‌ అండగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ప్రమాద వార్త తెలిసి షాక్‌కు గురయ్యా. మృతుల్లో చాలా మంది యువ విద్యార్థులు ఉన్నారు. చాలా బాధ అనిపించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మోదీ రాసుకొచ్చారు.

Latest