AP: 2030 నాటికి రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ రంగం అభివృద్ధి కోసం రూ.500 కోట్లు కేటాయించామన్నారు. శుద్ధ ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ తయారీ విధానాలను తీసుకురావడం సహా 2027 నాటికి 2 గిగా వాట్లు, 2029 నాటికి 5 గిగా వాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ లక్ష్యంగా పెట్టుకుమన్నారు. కేజీ రూ.460గా ఉన్న హైడ్రోజన్ గ్యాస్ ధరను రూ.160కే లభించేలా చర్యలు చేపట్టాలన్నారు.
Post Views: 101








