ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ చుట్టూ స్థలంలో ఇటివల ఆక్రమణలు తొలగించిన నేపథ్యంలో కార్యాలయం చుట్టూ కంచే వేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇటీవల పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో ఆక్రమణలు తొలగించిన నేపథ్యంలో బ్యాంకు కార్యాలయం చుట్టూ ఉన్న దుకాణాలను సైతం తొలగించారు. బ్యాంకుకు వచ్చే వినియోగదారులకు దుకాణాలతో ఇబ్బంది ఎదురవుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా… ఆక్రమణల తొలగింపు పూర్తయింది. ఆర్.బీ.ఐ పరిధిలో ఉన్న స్థలంలో మొక్కు పెంచాలన్న ఉద్దేశంతో కంచే వేసేలా బ్యాంకు అధికారులు ప్రణాళికలు రూపొందించగా…. కలెక్టర్ సూచనల మేరకు పురపాలక యంత్రాంగాన్ని సంప్రదించారు. అక్కడికి చేరుకున్న టీ.పీ.వో సుమలత మున్సిపల్ కమీషనర్ తో చర్చించి త్వరలోనే కంచే విషయమై నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు కంచే వేయకుండా ఉండాలని సూచించారు. అదేవిధంగా బ్యాంకు చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేయవద్దని వీధి వ్యాపారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఆర్.ఎం రామచంద్ర రావు మాట్లాడుతూ ఆర్బీఐ పరిధిలో ఉన్న స్థలంలో మాంసం దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో బ్యాంకుకు వచ్చే వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని, విషయాన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకేల్లడంతో తగు సూచనలు చేశారన్నారు. పుర అధికారుల సూచనల మేరకు ప్రస్తుతం కంచే వేయడం లేదని, వీధి వ్యాపారాలు సైతం వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి దుకాణాలు ఏర్పాటు చేయవద్దని అన్నారు.







