Mahaa Daily Exclusive

  ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్..!

Share

హన్మకొండ మహా;

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ,ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవాలను ఎక్కువ జరిగేలా,అలాగే సి సెక్షన్ లను తగ్గించేలా అవగాహన కలిపించడం తో పాటు తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ అరోగ్య కేంద్రాలు,బస్తీ దవాఖాన , ఆర్బీఎస్కే వైద్య అధికారులు,ఆరోగ్యశ్రీ,108 ,టీ హబ్,తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అ.అప్పయ్య జిల్లాలో నిర్వహించిన ఆరోగ్య కార్యక్రమాలపై ,సీజనల్ వ్యాధులపై వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్
ఆర్ బి ఎస్ కే బృందాలు ఏ విధంగా స్కూల్స్,అంగన్ వాడి కేంద్రాల్లో సేవలు అందిస్తున్నారు,ఏ విధమైన సమస్యలు గుర్తిస్తున్నారు ,ఫాలో అప్ సేవలు తెలుసుకుని వారికి నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ అప్పయ్య,అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డీఆర్ మహేందర్ , టీబీ అధికారి ౠ హిమబిందు,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్,డాక్టర్ మంజుల,ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అఖిల్,108 కో ఆర్డినేటర్,డెమో అశోక్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు,
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు , బస్తీ దవాఖాన వైద్యులు పాల్గొన్నారు.