Mahaa Daily Exclusive

  ద్విచక్ర వాహన దొంగలకు చెక్ పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు దొంగిలించిన వాహనాను బాధితులకు అప్పగించిన ట్రాఫిక్ సిఐ ..!

Share

హన్మకొండ మహా;

వరంగల్ పోలీస్ కమీషనర్ అఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు వారి వాహనాలు తనిఖీల్లో భాగంగా
ఆంధ్రపదేశ్ రాష్ట్రం లో 2025 మార్చి నెలలో దొంగిలించబడిన AP40 D 0158 పల్సర్ NS 160 ద్విచక్రవాహనాన్ని సంబంధిత బాధితుడికి హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు అప్పగించారు. ఈ వాహనం నంబర్ ప్లేట్స్ తీసివేసి తిరుగుచుండగా హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ వారు వాహన తనిఖీలు నిర్వహించగా వాహనం నడుపుతున్న వ్యక్తి పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారని అనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతా రెడ్డి తెలిపారు.