వరంగల్ మహా;
మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి వరంగల్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, నషాముక్త భారత్ లో భాగంగా చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. పోలీస్, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలతో జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ముఖ్యంగా యువత లో చైతన్యం తేవాలన్నారు. డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని , కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయి వినియోగించకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు.
ఈ సమీక్షలో జెడ్పి సీఈవో రామిరెడ్డి, డిఇఓ జ్ఞానేశ్వర్, డి డబ్ల్యు ఓ రాజమణి, డిఎం హెచ్ ఓ సాంబశివరావు , పోలీసు, నార్కోటిక్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.







