వరంగల్ మహా;
మన సనాతన హిందూ సేవా సమితి నుండి 91వ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా చిన్న వయసు లోనే భర్త ను కోల్పోయి పిల్లల పోషణ భారంగా మారి దివ్యాంగురాలు అయిన వరంగల్ మట్టేవాడ లోని జ్యోతి కాలనీ కి చెందిన బోలిశెట్టి సక్కు బాయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, గ్రూప్ సభ్యులు నోముల మహేష్ బాబు, గంగిడి ధర్మారెడ్డి, మంద యాకుబ్ రాజ్, బెలిదె రాజేశ్వర్ పాల్గొన్నారు.
Post Views: 29







